పెథాయ్ ఎఫెక్ట్ : వరంగల్ లో వర్షం

వరంగల్ : పెథాయ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోస్తరు వర్షం పడుతోంది. ఇవాళ డిసెంబర్-17న ఉదయం నుంచి వరంగల్ రూరల్, అర్బన్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వాతావరణం ఒక్కసారిగా మారడంతో చలితీవ్రత పెరిగింది. దీంతో బయటకు రాలేక వణికిపోతున్నారు జనం. వృద్దులు, చిన్నారుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఉదయం 8 దాటినా సూర్యుడు కనిపించడంలేదు.

 

 

Posted in Uncategorized

Latest Updates