పెద్దపల్లిలో పురావస్తు తవ్వకాలు : ఎముకల పాచికలు, మట్టి రింగ్ లు లభ్యం

chariరెండు వేల సంవత్సరాల నాటి మట్టిపాత్రలు, కొలత పావులు, రింగ్‌ వంటి వస్తువులు, ఇటుక కట్టడాలు పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడ్డాయి. నెల రోజులుగా రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులు పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూర్‌లో చేపట్టిన తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి. బుధవారం (మార్చి28) పురావస్తుశాఖ డైరెక్టర్‌ విశాలాచ్చి వీటిని పరిశీలించారు.

50 ఏళ్ల తర్వాత మళ్లీ తవ్వకాలు సాగిస్తున్నామని.. చరిత్రను రాబోయే తరాలకు తెలియజేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. శాతవాహనులు పెద్దబొంకూర్‌ నుంచి తమ పాలన సాగించినట్లు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. అప్పట్లో ఈ ప్రాంతవాసులు మట్టితో తయారైన పూసలను మెడలో వేసుకునేవారని.. లభించిన ఆధారాలు ద్వారా తెలుస్తుందన్నారు. శంకంతో చేసిన పూసలు, క్రిస్టల్, గాజు, షేల్‌ బ్రీడ్స్, కార్నేలియన్‌ పూసలను కూడా వినియోగించినట్లు వీటిని చూస్తే తెలుస్తోందన్నారు. ఎముకలతో తయారైన పాచికలను తయారు చేసిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. ఇనుముతో తయారు చేసిన రింగ్, మట్టిపాత్రలు కూడా తవ్వకాల్లో బయటపడినట్లు తెలిపారు.

ఇటుక కట్టడాలు, నీటిబావులు, డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత చారిత్రక పరిశోధనలు చేపట్టిన సిద్దిపేట జిల్లాలో బృహత్‌ శిలాయుగపు సమాధుల్లో లభించిన మానవ అవశేషాలు క్రీస్తుపూర్వం 600 ఏళ్ల నాటివిగా గుర్తించినట్లు తెలిపారు. పుల్లూరుబండ గ్రామంలో చేపట్టిన తవ్వకాల్లో బయటపడిన మానవ ఆకృతి గల స్త్రీ శిల్పం(ఆంత్రోఫామిక్‌ ఫిమేల్‌ ఫిగర్‌) దక్షిణ భారతదేశంలోనే మొదటిగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.
pedda

Posted in Uncategorized

Latest Updates