పెద్దపల్లి జిల్లా.. దేశంలోనే పెద్దపులి : కలెక్టర్ దేవసేన

న్యూఢిల్లీ : తెలంగాణలోని, పెద్దపల్లి జిల్లా దేశంలో పెద్దపులి లాంటి జిల్లాగా నిరూపించుకోవడం గర్వంగా ఉందన్నారు ఆ జిల్లా కలెక్టర్‌ దేవసేన. ఢిల్లీలో  స్వచ్ఛ భారత్‌ మిషన్‌ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా .. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా దివాస్‌ కార్యక్రమాన్ని మంగళవారం (అక్టోబర్-2) నిర్వహించింది. ఇందులో భాగంగా కేంద్ర పారిశుద్ధ్య శాఖా మంత్రి ఉమాభారతి స్వచ్చ్ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018 అవార్డులను ప్రదానం చేశారు. స్వచ్చతాలో 97.45 పాయింట్లతో దేశంలో మూడో స్థానం, దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దపల్లికి మొదటి స్థానం దక్కడం పట్ల కలెక్టర్‌ దేవసేన ఆనందం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న తర్వత మాట్లాడుతూ.. రెండు అవార్డులు దక్కించుకుని పెద్దపల్లి జిల్లా దేశంలో పెద్దపులి లాంటి జిల్లాగా నిరూపించుకోవడం గర్వంగా ఉందన్నారు. స్వచ్చతా విషయంలో జిల్లాలో అనేక సంస్కరణలు చేపట్టామని ఆమె తెలిపారు. ప్రతి శుక్రవారం స్వచ్చ్ వారాన్ని ఏర్పాటు చేసి స్వచ్చతాను పెంపొందిస్తున్నామన్నారు. గ్రామాల్లో, ముఖ్య కూడళ్లలో చెత్తా చెదారం లేకుండా చేయడం ద్వారా దోమలను అరికట్టగలిగి, అంటు వ్యాధులను కొంత వరకు నిరోధించగలిగామని తెలిపారు కలెక్టర్.

Posted in Uncategorized

Latest Updates