పెద్దాయనకు ఏమైంది : ఢిల్లీ ఎయిమ్స్ లో వాజ్ పేయికి చికిత్స

vajpayeeమాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి జూన్ 11వ తేదీ ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. కొంతకాలంగా వాజ్‌పేయి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఐదేళ్లుగా ఇంటికే పరిమితం అయ్యారు. బయటకు కూడా రావటం లేదు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం రాత్రి నుంచి మరింత అస్వస్థతకు గురవ్వటంతో.. కుటుంబ సభ్యులు ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ట్రీట్ మెంట్ జరుగుతుంది. ఇది సాధారణ వైద్య పరీక్షల్లో భాగమే అంటూ వైద్యులు తెలిపారు.

నైతిక విలువలకు కట్టుబడి ఉన్న తొలితరం రాజకీయనాయకుడు వాజ్ పేయి. 1998 నుంచి 2004 వరకు ప్రధానిగా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు భారతరత్న అవార్డు కూడా దక్కింది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఆధ్వర్యంలో వాజ్‌పేయికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

Posted in Uncategorized

Latest Updates