పెద్ద చేపలే పడ్డాయ్ : లంచం తీసుకుంటూ.. ఏసీబీ వలలో SI, కానిస్టేబుల్

acb-ridesఆయన స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ (SI), మరో వ్యక్తి అదే స్టేషన్ లో పని చేసే కానిస్టేబుల్. వీరు ఓ మర్డర్ కేసు ఎంక్వయిరీ చేస్తున్నారు. ఇదే సమయంలో ACBకి దొరికిపోయారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ ఆసిఫ్ నగర్ డివిజన్ పరిధిలోని హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ SIగా ఉన్నారు సీహెచ్ శ్రీకాంత్. 2018 జనవరి నెలలో నమోదు అయిన క్రైం నెంబర్ 8/2018 కేసులో విచారణ చేస్తున్నారు. నిందితులకు త్వరగా బెయిల్ రావటం కోసం.. ఛార్జిషీటులో తక్కువ తీవ్రత ఉన్న కేసులు పెడతా అంటూ ఎస్సై శ్రీకాంత్ నిందితుల తరపు వ్యక్తులతో డీల్ కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా నిందితుడి సోదరుడు అలీ మహ్మద్ నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. మొదట రూ.20వేలు.. రెండోసారి రూ.10వేలు ఇచ్చాడు అతను. మళ్లీ మళ్లీ డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో.. మూడోసారి ఏసీబీని అశ్రయించాడు నిందితులు తరపు వ్యక్తులు.

అలీ మహ్మద్ ద్వారా రూ.20వేల రూపాయలు తీసుకోవటానికి అంగీకరించారు ఎస్సై శ్రీకాంత్. ఈ డబ్బును తీసుకురావాలని కానిస్టేబుల్ రహీం పాషాను హుమాయున్ నగర్ పీఎస్ సమీపంలోని ఫ్లఓవర్ దగ్గర ఉన్న సులభ్ కాంప్లెక్స్ దగ్గరకు పంపించాడు. నిందితుడి తరపు వ్యక్తి నుంచి కానిస్టేబుల్ రహీం పాషా రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పరీక్షల్లో కూడా లంచం తీసుకున్నట్లు నిర్థారణ అయ్యిందని తెలిపారు ఏసీబీ అధికారి. కేసు నమోదు చేసి విచారణ చేస్తామన్నారు.

Posted in Uncategorized

Latest Updates