పెయిడ్ న్యూస్ పై నిరంతరం నిఘా… రూల్స్ పాటించాలన్న ఈసీ

బేగంపేట్ : ఎన్నికల సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం అయ్యే పెయిడ్ న్యూస్ పై బేగంపేట టూరిజం ప్లాజాలో ఎన్నికల అధికారులకు వర్క్ షాప్ నిర్వహించింది ఎన్నికల కమిషన్. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ టీవీకే రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సీఈసీ రజత్ కుమార్ మాట్లాడుతూ.. “సోషల్ మీడియాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. రెగ్యులర్ గా సోషల్ మీడియాను మానిటర్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే…. పరిశీలించి సైబర్ క్రైమ్ పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. ఏదైనా పార్టీ అభ్యర్థికి అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయి. వార్తలు షేర్ చేసేటప్పుడు కూడా యూజర్స్ జాగ్రత్తగా ఉండాలి. ఊహిస్తూ రాసే వార్తలు కూడా కరెక్ట్ కాదు” అన్నారు.

పీఐబీ అధికారి టీవీకే రెడ్డి మాట్లాడుతూ.. “ ఎలక్షన్ లో మీడియా చాలా అవసరం. ఎన్నికలు ముగిసే వరకు కొంత మేర మీడియాపై నియంత్రణ ఉండాలి. రహస్య ఓటింగ్ ప్రాంతానికి తప్ప అన్నీ ప్రాంతాలకు మీడియా వెళ్లేందుకు అనుమతి ఉంది. 126 (a) ప్రకారం ఎన్నికల అన్ని దశలు పూర్తయ్యేవరకు ఎగ్జిట్ పోల్స్ ను ప్రసారం చేయకూడదు. కానీ ఒపీనియన్ పోల్స్ మీద ఎలాంటి నిషేధం లేదు. ఎలక్షన్ కు 48 గంటల ముందు సోషల్ మీడియాకి కూడా మీడియా, ప్రింట్ మీడియా మాదిరిగానే నిబంధనలు వర్తిస్తాయి. చివరి 48 గంటల్లో టీవీ, యూ ట్యూబ్ ఛానెల్స్ ద్వారా కూడా ప్రచారం చేయొద్దు. రాజకీయ ప్రకటనలు ఇచ్చే వారి నుంచి చెక్కు, డీడీ రూపంలో నగదు తీసుకోవాలి. పోలింగ్ కు 48 గంటల ముందు వరకు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ప్రకటనలకు ప్రి-సర్టిఫికెషన్ ఇవ్వాలి. కులం, మతాలపై ఆరోపణలు.. హింసను ప్రేరేపించే ప్రకటనలు.. కోర్టు విధివిధానాలను ప్రశ్నించే ప్రకటనలు ప్రసారం చేయకూడదు. ప్రతి అభ్యర్థి ఇది తన ఫేస్ బుక్, తానే మెయిన్ టెయిన్ చేస్తున్నట్టు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాలి. పెయిడ్ న్యూస్ ప్రసారం చేయొద్దు. దీనిపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. పెయిడ్ న్యూస్ విషయంలో మీడియాకు నోటీస్ ఇచ్చే అధికారం ఎన్నికల కమిషన్ కు లేదు. NBA, పిసిఐకు మాత్రమే అధికారాలు ఉంటాయి” అన్నారు.

Posted in Uncategorized

Latest Updates