పెరిగిన ఉపాధి కూలీల వేతనం

oopadhi
ఉపాధిహామీ కూలీలకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. రోజువారీ వేతనం పెంచింది. ఇప్పటివరకు ఒక్కో కూలీకి గరిష్టం వేతనం రూ.197 చెల్లిస్తుండగా… ఇకనుంచి రూ.205 ఇస్తారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీలకు రోజువారీ కూలీని పెంచుతున్నట్లు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ శనివారం(జూన్-2) ఉత్తర్వులు జారీచేశారు. రోజుకు రూ.8 చొప్పున పెంచుతున్నట్టు జీవోలో తెలిపింది. ఈ పెరిగిన కూలీ ఏప్రిల్ నెల నుంచే వర్తిస్తుందని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates