పెరిగిన చికెన్ ధరలు

 

 

 

మార్కెట్లో చికెన్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. చలికాలం, క్రిస్మస్, ఎలక్షన్, కొన్నిచోట్ల వర్షాలు కురుస్తుండటంతో..చికెన్ కు డిమాండ్ పెరుగుతోంది. కార్తీక మాసం ముగియడంతోనూ చికెన్ రేట్ పెరిగిందని చెబుతున్నారు వ్యాపారులు. డిమాండ్ కు తగిన సప్లయ్ లేకపోవడంతో చికెన్ ధరలు పెరగడానికి కారణమంటున్నారు. రెండు వారాల క్రితం అందుబాటులో ఉన్న చికెన్ ధర ప్రస్తుతం కేజీ 2 వందలు దాటింది. 15 రోజుల క్రితం కిలో 170 రూపాయలు ఉండే చికెన్ ధర..ఇపుడు 210 రూపాయిలుగా ఉంది. వరుసగా క్రిస్మస్, పంచాయతీ  ఎలక్షన్స్, న్యూ ఇయర్, సంక్రాంతి ఉండటంతో ..రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు.

Posted in Uncategorized

Latest Updates