పెరిగిన తాజ్‌మహల్‌ టికెట్ల ధరలు

Taj_Mahal_(Edited).jpegప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను సందర్శించాలంటే ఇకపై ఎక్కువ ధర చెల్లించాల్సిందే. అయితే అపురూపమైన తాజ్‌మహల్ సందర్శకుల టికెట్ ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ప్రవేశ టికెట్ ధరను రూ.40 నుంచి రూ.50కి పెంచడంతోపాటు ప్రధాన సమాధి సందర్శన టికెట్ రేటును రూ.200గా నిర్ణయించింది. పెరిగిన ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర సాంస్కృతిశాఖ మంత్రి మహేశ్‌శర్మ మంగళవారం (ఫిబ్రవరి-13)  చెప్పారు.

ఈ మార్పులు తాజ్‌మహల్‌ను కాపాడటానికి, సందర్శకుల తాకిడి నియంత్రణకు దోహదపడుతాయని ఆయన తెలిపారు. కొత్తగా ప్రవేశపెడుతున్న బార్‌కోడెడ్ టికెట్లు మూడుగంటలు మాత్రమే చెల్లుబాటవుతాయి అన్నారు శర్మ. తాజ్‌మహల్ సామర్థ్యంపై ఇటీవల జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నీరి) సర్వే నిర్వహించింది. వారసత్వ సంపదను కాపాడుకునేందుకు ప్రధాన సమాధిలోకి వచ్చే పర్యాటకుల సంఖ్యను తగ్గించాలని ఆ సర్వే సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ధరల పెరుగుదల రాబడిని పెంచదు కానీ, తాజ్‌మహల్‌పై ఆసక్తి ఉన్న వ్యక్తులు మాత్రమే వస్తారు అని మంత్రి శర్మ వెల్లడించారు. విదేశీయులకు ప్రవేశ టికెట్ ధరను రూ. వెయ్యి రెండు వందల యాబైగా నిర్ణయించినట్టు చెప్పారు.

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates