పెరిగిన తాజ్ మహల్ టికెట్ ధరలు

ఆగ్రా: ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం ఏంటని అడిగితే టక్కున చెప్పే చారిత్రక కట్టడం తాజ్ మహల్. రోజురోజుకి టూరిస్టుల తాకిడి పెరుగుతన్న క్రమంలో తాజ్ మహల్ సందర్శన టికెట్ ధరలను పెంచారు. తాజ్‌ ప్రధాన మందిరంలోకి ప్రవేశించి లోపల అందాలను తిలకించాలంటే ఇకపై రూ.250 టికెట్‌ కొనాలి. రూ.50 టికెట్‌ తో తాజ్‌ లోకి ప్రవేశం లభిస్తుంది కానీ.. బయట నుంచే అందాలను వీక్షించాల్సి ఉంటుంది.

తాజ్‌ ముంగిట ప్రవహించే యమునా నది పరవళ్లు, మందిరం నలువైపులా పరిసరాల అందాల వరకు తిలకించొచ్చు. ప్రధాన మందిరం వీక్షించాలనుకునే విదేశీ సందర్శకులకు టికెట్‌ రూ.1300, సార్క్‌ దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు టికెట్‌ రూ.740గా నిర్ణయించినట్లు భారత పురావస్తుశాఖ ముఖ్య అధికారి వసంత స్వర్ణాకర్‌ తెలిపారు. సందర్శకుల తాకిడి పెరగడంతో తాజ్‌మహల్‌ రంగు మారడమేకాక ప్రధాన కట్టడం దెబ్బతింటోందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్‌ ధరల పెంపుతో సందర్శకుల తాకిడికి అడ్డుకట్ట పడగలదని అధికారుల అంచనా.

Posted in Uncategorized

Latest Updates