పెరిగిన ధిక్కారస్వరం : యోగీ పాలనలో ప్రజలు సంతోషంగా లేరన్న మంత్రి రాజ్ బహర్

upఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల ఫతితాల తర్వాత అధికార బీజేపీ నాయకులు ప్రభుత్వంపై ధిక్కారస్వరం పెంచారు. ప్రభుత్వశాఖల్లో అవినీతి భారీగా పెరిగిపోయిందని, గత ప్రభుత్వం కంటే యోగి పాలనలో అవినీతి పెరిగిపోయిందని, అందుకే ప్రజలు ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించారని అధికార బీజేపీ ఎమ్మెల్యే కామెంట్లు చేశారు. ఇప్పుడు ఓ మంత్రి మోగి పాలనపై వివాదాస్పద కామెంట్లు చేశారు. కేశవ్ ప్రసాద్ మౌర్య సీఎం అవుతాడని 2017 అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల ప్రజలు బీజేపీకి ఓటు వేశారని.. అయితే యోగి ఆదిత్యనాధ్ ను సీఎం చేయడంతో ఓటర్లు నిరాశ చెందారని అందుకే ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని, ఇది చేదు నిజమని యూపీ మంత్రి ఓ.పి. రాజ్ బహర్ అన్నారు. కిందిస్ధాయిలో ప్రజలు ప్రభుత్వం పట్ల సంతోషంగా లేరన్నారు. తాము అధికారంలో ఉండి కూడా చెరకు రైతుల విషయంలో ఫెయిల్ అయ్యామన్నారు.

Posted in Uncategorized

Latest Updates