పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. ఫ్యూయల్స్‌పైన ఢిల్లీ సర్కార్‌‌ వ్యాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ (వ్యాట్‌) పెంచడంతో పెట్రోలపై లీటర్‌‌కు 1.67 పైసలు, డీజిల్‌పై రూ.7.10పైసలు పెరిగాయి. ఈ పెంపుతో ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.71.26కు చేరుకుంది. పెంపుకు ముందు పెట్రోల్‌ ధర రూ.69.59. డీజిల్‌ ధర గతంలో 62.29 కాగా.. పెంపు తర్వాత అది రూ.69.39కి చేరింది. పెంచిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. చెన్నై , అస్సాం, హర్యానా, నాగాలాండ్‌, కర్నాటక, లెస్ట్‌ బెంగాల్‌ రాష్ట్రాలు కూడా ఇప్పటికే వ్యాట్‌ పెంచడంతో ఆయా రాష్ట్రాల్లో కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. ముంబైలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కాగా హదరాబాద్‌లో పెట్రోల్‌ ధర 73.97 ఉండగా.. డీజిల్‌ ధర 67.82 ఉంది.

Latest Updates