పెరుగన్నంతో మానసిక ప్రశాంతత

 అన్నానికి పురాణాల కాలం నుంచీ ఎంతో ప్రాశస్త్యం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పెరుగన్నానికి. చాలామంది ఇష్టంగా తింటారు. పెరుగన్నం తినడం వల్ల మెదడులో ట్రిప్టోఫాన్‌ అంటే అమైనో ఆసిడ్‌ విడుదలవుతుంది. ఈ ఆసిడ్‌ వల్ల మెదడులోని నరాలన్నీ చల్లబడి మెదడు కూల్‌గా ఉంటుందట. అంతేకాదు ఇది శరీరంలోని అన్ని కణాలకు ప్రశాంతమైన సందేశాలను పంపుతుందట. అందుకే పెరుగన్నం మెదడుకి మేత అంటారు. దీనివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అంటున్నారు వైద్యులు. భారతీయులు మాత్రమే పెరుగును నేరుగా తింటారు. మిగతా దేశాల్లో పెరుగులో కొంచెం షుగర్‌ కలిపి యోగర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకుంటారు. దీనివల్ల మెదడులోని నరాలు సరిగా పనిచేయవట. ట్రిప్టోఫాన్‌ అనే పదం సంస్కృతంలో ‘తృప్తి’ అనే పదం నుంచి వచ్చిందట. అందుకే భోజనం సంపూర్తికావాలంటే పెరుగన్నం తప్పని సరిగా తినాలి అంటారు మన పెద్దలు.

Posted in Uncategorized

Latest Updates