పెరుగుతున్న డిమాండ్ : సర్కార్ స్కూల్స్ లో అడ్మిషన్స్ క్లోజ్

SCHOOLతెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్స్ కి డిమాండ్ పెరుగుతోంది. మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్, బుక్స్, బాలికలకు హెల్త్ కిట్స్ లాంటి పథకాలను ప్రభుత్వ పాఠశాలలతో చదివే విద్యార్థుల కోసం సర్కార్  ప్రవేశపెడుతున్న క్రమంలో ..డిమాండ్ పెరుగుతోంది. కార్పెరేట్ స్కూల్స్ కి తగ్గట్టుగా కొన్ని స్కూల్స్ నిర్మాణం చేయడంతో ..స్కూల్స్ లో మెరుగైన సదుపాయలు ఉండటంతోనే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.

ఇటీవల హైదరాబాద్ లోని రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ల కోరకు విద్యార్థుల తల్లిదండ్రులు బారులు తీరిన విషయం తెలిసిందే. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని పలు స్కూల్స్ లో ఉంది. దీంతో అడ్మిషన్స్ క్లోస్ అని బోర్డ్స్ పెట్టేస్తున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను చేర్పించడానికి వారి తల్లిదండ్రులు పోటీపడుతున్నారు. ఇక్కడ 80 మంది విద్యార్థులు మాత్రమే చదువుకోవడానికి సౌకర్యం ఉండగా ఇప్పటికే 120 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో చేసేది లేక స్కూల్ హెడ్ మాస్టర్ అడ్మిషన్స్‌ క్లోజ్  అనే బోర్డు పెట్టించారు. దీంతో ర్కారు బడులన్నిటికీ ఈ స్కూల్ ఆదర్శంగా నిలుస్తోంది. గతంలో ఎన్నడూ చోటు చేసుకోని ఈ పరిణామాలకు కారణం సర్కార్ బడుల్లో కనిపిస్తున్న అభివృద్ధి..స్టడీలో క్వాలిటి అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఇంతకుముందుతో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయని చెబుతున్నారు విద్యాశాఖ అధికారులు. ఇంకో రెండు మూడు నెలల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూల్స్ ఫుల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates