పెరుగుతున్న శిశు మరణాలు : గోల్డెన్ అవర్ పై అవగాహన తప్పనిసరి

దేశంలో అప్పుడే పుట్టిన పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు.  తల్లి ముర్రుపాలు దొరకక.. కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బిడ్డ పుట్టిన గంటలోపు పాలు ఇవ్వాలని సూచిస్తున్నారు డాక్టర్లు.  గోల్డెన్ అవర్ గా చెప్పుకునే..  ఈ గంటపై  మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు.

అమ్మపాలు అమృతం, ముర్రుపాలు దివ్య ఔషధం.. ఇది ఎంతో కాలంగా వైద్యులు చెబుతున్న మాట. కానీ ఇంకా పూర్తిస్ధాయలో మాత్రం అమలు కావడం లేదు. అవగాహన లేక అప్పుడే పుట్టిన పిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడంలో నిర్లక్ష్యం కంటిన్యూ అవుతోంది. దీంతో.. ఎంతో మంది చిన్నారులు పూర్తి స్ధాయిలో కళ్లు తెరిచే లోపే… ప్రాణాలు పోగొట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

డెలివరీ అయిన గంటలోపు బిడ్డకు తల్లి పాలివ్వడం ముఖ్యం అంటున్నారు డాక్టర్లు. అప్పుడే బిడ్డ ఆరోగ్యంగా పెరగడంతో పాటు .. తల్లికి కూడా ఎంతో మంచిదంటున్నారు. పుట్టినప్పటి నుంచి కనీసం ఆరు నెలలు తల్లిపాలు పట్టించాలంటున్నారు. ఇలా చేయకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మొదటి గంటలో వచ్చే ముర్రుపాలిస్తే ఇన్ఫెక్షన్స్ సోకకుండా బిడ్డను కాపాడుకోవచ్చంటున్నారు. భవిష్యత్ లో దీర్ఘకాలిక జబ్బులు రావడంటున్నారు డాక్టర్లు.

వివిధ కారణాలతో తల్లిపాలివ్వకపోవడం వల్ల పౌష్టిహారం లేక 56శాతం మంది పిల్లలు వివిధ రకాల జబ్బలుతో బాధపడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. తల్లిపాలు తాగకపోవడంతో  ఏటా 3 నుంచి 5 లక్షల మంది శిశువులు చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. పుట్టిన బిడ్డ మొదటి నెలలో వివిధ కారణాలతో చనిపోయే చిన్నారుల సంఖ్య … మన రాష్ట్రంలో వెయ్యికి 27 మంది ఉన్నారంటున్నారు డాక్టర్లు. ఈ రేషియోను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

పిల్లలకు పాలు ఇవ్వకపోతే తల్లికి కొవ్వు పేరుకుపోయి … బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు. ఎక్కువ పాలు వచ్చే వారు నీలోఫర్ లాంటి మిల్క్ బ్యాంక్ ఉన్న దగ్గర పాలు ఇస్తే.. ఇతర పిల్లలకు ఉపయోగపడతాయంటున్నారు. పిల్లులు పుట్టిన ఆరు నెలల పాటు ఆవు, బర్రె, పౌడర్ పాలను ఇస్తే.. పిల్లలకు రక్తహీనత, ఎముకల బలహీనత, ఆస్తమా, నిమోనియా, డయేరియాతో పాటు అధిక బరువు ఉంటారని చెబుతున్నారు. రోజురోజుకు శిశు మరణాలు పెరుగుతుండటంతో తల్లిపాల ప్రాముఖ్యతపై అందరికీ అవగాహన కల్పించాలంటున్నారు డాక్టర్లు.

 

Posted in Uncategorized

Latest Updates