పెరుగుతూనే ఉన్న పెట్రోల్,డీజిల్ ధరలు

petrol-diesel-ratesపెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. రోజువారీ ధరల సవరణతో కొంచెం కొంచెంగా పెరుగుతూ…తడిసి మోపెడు అవుతున్నాయి. జనం జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఆదివారం (ఏప్రిల్-1) డీజిల్ ఆల్‌టైమ్ హై ధరను అందుకోగా..పెట్రోల్ నాలుగేళ్ల గరిష్టానికి చేరింది.

ముఖ్యంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ధరలు దేశంలోనే అత్యధిక స్థాయికి చేరాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.78.08కు, డీజిల్‌ ధర రూ.70.16కు.. విజయవాడలో పెట్రోల్‌ రూ.79.43కు, డీజిల్‌ రూ. 71.59కు చేరాయి. తెలుగు రాష్ట్రాలు డీజిల్‌ ధరలో దేశంలోనే టాప్‌గా నిలవగా.. పెట్రోల్‌ ధరలో రెండో స్థానంలో ఉన్నాయి.

ఆయిల్ కంపెనీలు మొదట్లో ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్‌ ధరలను సమీక్షించేవి. అయితే గతేడాది జూన్‌ 16వ తేదీ నుంచి మార్కెట్‌ ధరలకు అనుగుణంగా ఏ రోజుకారోజు ధరల సవరణను అమల్లోకి తెచ్చాయి. ఇందులో తొలి 15 రోజుల పాటు ధరలు తగ్గించగా.. ఆ తర్వాతి నుంచి మోత మోగిస్తూనే వస్తున్నాయి. మార్కెట్‌ ధరల సవరణ సమయంలో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.67.11 కాగా.. మూడు నెలల క్రితం రూ.75.47కు, తాజాగా రూ.78.08కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర గత నెల 23న రూ. 76.56 మాత్రమే. అంటే ఈ పది రోజుల్లోనే రూ.1.52 పెరిగింది. ఇందులో ఆదివారం(ఏప్రిల్-1) రోజునే 19 పైసలు పెరిగింది. ఇక మూడు నెలల కింద డీజిల్‌ ధర రూ.రూ.67.23కాగా.. ఇప్పుడు రూ.70.16కు చేరింది.

రాష్ట్రంలో పెరిగిన ధరలు:

సంవత్సరం        లీటర్ పెట్రోల్       లీటర్ డీజిల్

2013 సెప్టెంబర్   రూ.83.07       రూ.58.87

2016 జనవరి     రూ.80.83       రూ.54.40

2018 ఏప్రిల్       రూ.78.08       రూ.70.16

Posted in Uncategorized

Latest Updates