పెర్త్ టెస్ట్: థర్డ్ డే.. 175 రన్స్ లీడ్ లో ఆసీస్

పెర్త్ వేదికగా భారత్,ఆసీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్  ఇంట్రస్టింగ్ గా మారింది. 172/3 ఓవైర్‌నైట్‌ స్కోర్‌తో  మూడో రోజు ఆటను ప్రారంభించించిన టీమిండియా మొదట్లోనే ఆజింక్యా రహానే(51) వికెట్ ను కోల్పోయింది. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన హనుమ విహారి కోహ్లికి సపోర్ట్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లి సెంచరీ కంప్లీట్ చేశాడు. వీరి పార్ట్ నర్ షిప్ కు ఆసీస్ బౌలర్ హాజల్ వుడ్ బ్రేక్ వేశాడు హాజల్ వుడ్ బౌలింగ్ లో హనుమ విహారి(20) ఔటయ్యాడు.

మరోవైపు సెంచరీతో ఫామ్ లో ఉన్న కోహ్లి థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. కోహ్లి ఔటైన తర్వాత టీమిండియా బ్యాట్స్ మెన్ ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరడంతో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 283 రన్స్ కు ఆలౌటైంది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో  ఆసీస్ 43 రన్స్ ఆధిక్యం సాధించింది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 132 రన్స్ చేసింది. ప్రస్తుతం ఆసీస్ 175 రన్స్ లీడ్ లో ఉంది.

 

 

Posted in Uncategorized

Latest Updates