పెర్త్ టెస్ట్: ఫస్ట్ డే…ఆసీస్ 277/6

పెర్త్ వేదికగా భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న సెకండ్ టెస్ట్ లో మొదటి రోజు నుంచే రెండు జట్లు హోరాహోరీ పోరు కొనసాగిస్తున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఆరోన్ ఫించ్,మార్కస్ హ్యారిస్ అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చారు. బౌన్సీ,పేస్ పిచ్ లోనూ  ఫస్ట్ వికెట్ కు వీరిద్దరూ 112 రన్స్ పార్ట్ నర్ షిప్ అందించారు. అయితే వీరిద్దరి పార్ట్ నర్ షిప్ కు బుమ్రా బ్రేక్ వేశాడు. ఆరోన్ ఫించ్  ఫస్ట్ వికెట్ గా పెవిలియన్ కు చేరిన తర్వాత కూడా హ్యారిస్ తన దూకుడు కొనసాగించాడు. అతడిని పార్ట్ టైమ్ బౌలర్ గా వచ్చిన హనుమ విహారి ఔట్ చేశాడు.

వెంట వెంటనే వికెట్లు పడటంతో పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌,  షాన్‌ మార్ష్‌ .. క్రీజులోకి వచ్చారు. రెండో టీ బ్రేక్ టైంకు ఆ టీం 145/3 స్కోర్ తో నిలిచింది. 148 రన్స్ దగ్గర హ్యాండ్స్ కాంబ్ ను ఇషాంత్ పెవిలియన్ కు పంపాడు. 148 రన్స్ దగ్గర నాలుగో వికెట్ తీసిన టీమిండియా ఐదో వికెట్ కోసం 232 రన్స్ వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. తర్వాత ఆసీస్ బ్యాట్స్ మెన్ వరుసగా వికెట్లు కోల్పోయారు. దీంతో మొదటి రోజు ముగిసే సమయానికి ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 277 రన్స్ చేసింది. భారత బౌలర్లలో ఇషాంత్,హనుమ విహారి చెరో రెండు వికెట్లు తీయగా, బుమ్రా,ఉమేశ్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.

Posted in Uncategorized

Latest Updates