పెళ్లికి నిరాకరించిన ప్రియుడు: యువతి ఆత్మహత్య

ప్రేమించానన్నాడు….పెళ్లి చేసుకుంటానన్నాడు..చివరకు మాట మార్చడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సికింద్రాద్ లో జరిగింది. కానాజీగూడకు చెందిన 17 ఏళ్ల అనిత…. అల్వాల్‌లో బేకరీ నడుపుతున్న జగ్గు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అనితతో చనువు పెంచుకున్నాడు. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కొద్ది రోజుల తర్వాత మాట మార్చాడు జగ్గు. దీంతో మనస్తాపం చెందిన అనిత ఇవాళ(శుక్రవారం) ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న ఆల్వాల్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనిత మృతికి కారణమైన జగ్గును అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Posted in Uncategorized

Latest Updates