తమనే పెళ్లి చేసుకోవాలని ఇద్దరు మహిళల వేధింపులు.. కానిస్టేబుల్ సూసైడ్

మహారాష్ట్ర: మహారాష్ర్టలోని కొల్హాపూర్ లో దారుణం జరిగింది. తోటి మహిళా కానిస్టేబుళ్లు పెళ్లి చేసుకోవాలంటూ వేధించడంతో… పెళ్లైన ఓ  కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.  కొల్హాపూర్ లోని రాజారాంపూరి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్(42ఏళ్లు)… 2012 నుంచి 2014 వరకు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో కలిసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేశాడు. ఈ సమయంలో అతడు వారిద్దరితో  వివాహేతర సంబంధం కొనసాగించాడు.

విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ముగ్గురినీ.. వేర్వేరు స్టేషన్లకు ట్రాన్స్ ఫర్ చేశారు. ఆ తర్వాత కానిస్టేబుల్ మరో పెళ్లి చేసుకున్నాడు. ట్రాన్స్ ఫర్ అయినప్పటికీ అతడు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో ‘రిలేషన్’ కొనసాగింది.  ఓ మహిళా కానిస్టేబుల్ ఏకంగా కానిస్టేబుల్ భార్య దగ్గరకు వచ్చి విడాకులు ఇవ్వమని బెదిరించింది. మరో మహిళా కానిస్టేబుల్ కూడా తనను పెళ్లిచేసుకోవాలంటూ పోరు పెట్టింది. ఇద్దరి నుంచి పెళ్లి డిమాండ్లు పెరిగిపోవడం.. భార్య నిలదీయడంతో… ఆ కానిస్టేబుల్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పై వివిధ సెక్ష‌న్ల కింద కేసు నమోదు చేశారు.

Posted in Uncategorized

Latest Updates