పెళ్లిపై తమన్నా ట్విట్ : బేస్ లెస్ రూమ‌ర్స్

హీరోయిన్ తమన్నా పెళ్లి చేసుకోబోతున్నారని ఇటీవల వార్తులు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై శుక్రవారం (జూలై-27)ట్విట్టర్ ద్వారా స్పందించారు తమన్నా. ఒక రోజు క్రికెట‌ర్, ఒక రోజు యాక్ట‌ర్, ఓ మ‌రో డాక్ట‌ర్‌. ఈ రూమర్స్ వింటుంటే నేనను భ‌ర్త కోసం షాపింగ్ చేస్తున్నానా అనే భావ‌న అందరిలో క‌లుగుతుంది. నా వ్యక్తిగ‌త విష‌యాల‌కి సంబంధించి ఎలాంటి ఆధారం లేకుండా వార్త‌లు రాస్తే అస్స‌లు ఒప్పుకోను. నేను సింగిల్‌గా చాలా సంతోషంగా ఉన్నా. నా తల్లిదండ్రులు పెళ్లి కొడుకు కోసం వెతకడం లేదు. ప్రస్తుతం నేను నా సినిమాలతో ప్రేమలో ఉన్నా. నేను షూటింగ్ చేస్తున్న స‌మ‌యంలో వ‌చ్చిన ఈ వదంతులు విని షాక్ అయ్యాను. అవి ఎక్కడి నుంచి వస్తాయో నాకు ఏ మాత్రం అర్థం కావడం లేదు. మీరు చేసే ప‌ని గౌర‌వ‌ప్ర‌దంగా లేదు. నేను పెళ్లి అనే బాట‌లో ప్ర‌యాణం చేయాల‌నుకున్న‌ప్పుడు త‌ప్ప‌కుండా అంద‌రికి తెలియ‌జేస్తాను. అప్ప‌టి వ‌ర‌కు బేస్ లెస్ రూమ‌ర్స్ స్ప్రెడ్ చేయోద్దు. మరోసారి ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నా. నా పెళ్లి ఇప్పటి వరకు నిశ్చయం కాలేదు. ఆధారాలు లేకుండా వస్తున్న వార్తలకు ఇక నైన స్వస్తి పలకండి. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన వార్త‌లు కొందరి ఊహాజనిత కథనం మాత్రమే అని ట్విట్ చేశారు తమన్నా.

ప్ర‌స్తుతం ఎఫ్ 2 అనే మ‌ల్టీ స్టార‌ర్ లో వెంకీ స‌ర‌స‌న న‌టిస్తున్న త‌మన్నా. . దీంతో పాటు కునాల్ కోహ్లి డైరెక్ష‌న్‌ లో తెర‌కెక్కుతున్న సినిమాతో పాటు చిరంజీవి సైరా, హిందీలో ఖామోషి, త‌మిళ్‌ లో క‌న్నె క‌లైమాని అనే సినిమాలు చేస్తుంది.

Posted in Uncategorized

Latest Updates