పెళ్లి కాకుండానే తల్లి అయ్యిందంటారు.. రూమర్లపై అనుష్క ఫైర్

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ.. తల్లి కాబోతున్నారన్న వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ‘జీరో’ సినిమా తర్వాత అనుష్క మరో సినిమా ప్రకటించక పోవడంతో ఆమె ప్రెగ్నెంట్ అని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ విషయం పై అనుష్క స్పందించింది. ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకువస్తాయి అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ హీరోయిన్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారని తెలిపింది. “వీటిని నేను అస్సలు పట్టించుకోను.. అయినా పెళ్ళిని దాచగలం కానీ.. గర్భాన్ని ఎలా దాచగలం. ఇలాంటి వదంతులు హీరోయిన్ లను పెళ్లి కాకుండానే వివాహితను చేసేస్తాయి, గర్భం దాల్చకుండానే తల్లిని చేసేస్తుంటాయి” అని చెప్పింది.

ప్రస్తుతం తాను సినిమాలతోనే బిజీగా ఉన్నట్లు తెలిపారు. టెస్ట్‌ సిరీస్‌ కోసం అనుష్క భర్త, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. డిసెంబర్‌ 11న తమ తొలి పెళ్లిరోజు వేడుకను అక్కడే సెలబ్రేట్‌ చేసుకోడానికి అనుష్క కూడా ఆస్ట్రేలియాకు వెళ్తోంది.

Posted in Uncategorized

Latest Updates