పెళ్లి కొడుకు అయిన సిరిసిల్ల జిల్లా ఎస్పీ

SP MARRIAGEరాజన్న సిరిసిల్ల జిల్లా SP ఓ ఇంటివాడు కాబోతున్నారు. SP రాహుల్ హెగ్డే పెళ్లి బుధవారం (జూలై-4)న జరగనుంది. బెంగళూరుకు చెందిన విజేతతో ఆయన వివాహ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. పెళ్లికిముందు జరిగే సంప్రదాయ వేడుకలకు జిల్లా నుంచి ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు బెంగళూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లే చేశారు. SP ని పెళ్లి కొడుకుగా ముస్తాబు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు SP బంధువులు. బుధవారం ఉదయం 9.30 గంటలకు బెంగళూరులో ఆయన వివాహం జరగనున్న ఈ వివాహ వేడుకకు ..తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్టు సమాచారం.

 

Posted in Uncategorized

Latest Updates