పెళ్లి చేసుకోమని ఇంటికెళితే దాడి: ప్రేమించి మోసం చేసిన ప్రియుడు

నిర్మల్ జిల్లా మామడలో ప్రేమించిన యువతిపై దాడికి దిగారు ప్రియుడి కుటుంబ సభ్యులు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలవడంతో పాటు అపస్మారక స్థితికి చేరుకుంది. విషయం తెలుసుకున్న తిరుమల సోదరుడు.. ఆమెను హాస్పిటల్ లో చేర్పించాడు. బాధిత యువతి తిరుమల, అడ్లూరి మనోజ్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని కోరగా మనోజ్ ముఖం చాటేస్తూ వస్తున్నాడు. దీంతో విసుగు చెందిన తిరుమల ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్షకు దిగింది. ఇది జీర్ణించుకోలేని మనోజ్ కుటుంబ సభ్యులు ఆమెపై దాడికి దిగారు. ప్రస్తుతం ప్రియుడు మనోజ్ పరారీలో ఉన్నాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితురాలి సోదరుడు అశోక్.

Latest Updates