పెళ్లి బృందం ఘోర రోడ్డు ప్రమాదం..22 మంది మృతి

MP ACCIDENTమధ్యప్రదేశ్‌ రాష్ట్రం సిధి జిల్లాలో మంగళవారం (ఏప్రిల్-17)రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ మినీ ట్రక్కు ప్రమాదవశాత్తూ అమేలియా ప్రాంతంలో జోగ్దాహా బ్రిడ్జిపై నుంచి సోన్‌ నదిలో సుమారు 70 అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది చనిపోయారు. ప్రమాదం జరిగిన స్పాట్ లోనే 15 మంది అక్కడికక్కడే మృతిచెందగా..చికిత్స పొందుతూ మరో ఏడుగురు చనిపోయినట్లు తెలిపారు పోలీసులు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని స్థానిక జిల్లా కలెక్టర్‌ దిలిప్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు. గాయపడిన వారిని దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ సీఎ: శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ విచారణ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల తక్షణ సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates