పెళ్ళి కి కూడా PF తీసుకోవచ్చు

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) చందా దారులకు శుభవార్త. పెళ్ళికి, ఇంటి కొనుగోలుకు, పిల్లల చదువుకు వంటి ఖర్చులకు సగం EPF మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. నగదును విత్‌డ్రా చేసుకునేందుకు ఫారం 31ను నింపాల్సి ఉంటుంది. పోస్టు మెట్రిక్యూలేషన్‌ స్టడీస్‌ కోసం 50 శాతం మొత్తాన్ని వడ్డీతో తీసుకునేలా నిబంధనలను మార్చుతోంది. ఇంటి కోసం 24 బేసిక్‌, డీఏ లేదా 36 నెలల బేసిక్‌ వేతనాలను విత్‌డ్రా చేసుకునేలా ఆప్షన్‌ను తీసుకొచ్చింది. PF మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే కనీసం ఐదేళ్ళు సభ్యుడిగా ఉండాలి. దీని కోసం ఉద్యోగి నుంచి డిక్లరేషన్‌ అవసరం. మిగతా ఏ డాక్యుమెంట్లను ఉద్యోగులు సమర్పించాల్సినవసరం లేదు.
ఇటీవలే నిరుద్యోగిగా మారిన నెల తర్వాత 75 శాతం EPF కార్పస్‌ను, 2 నెలలకు పైగా నిరుద్యోగిగా ఉంటే మిగతా ఆ 25 శాతం కూడా విత్‌డ్రా చేసుకునేలా అవకాశం కల్పించిన EPFO.

Posted in Uncategorized

Latest Updates