పెళ్ళి వాహనంలో ఎర్రచందనం స్మగ్లింగ్

తిరుపతి : పెళ్ళి వాహనం ముసుగులో ఎర్రచందనం అక్రమ రవాణా గుట్టును రట్టు చేశారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఎర్రచందనం స్మగ్లర్లను ఆట కట్టించారు. కారులో తరలించేందుకు సిద్ధమైన ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.  రేణిగుంట్ల సమీపంలోని తిరుమల నగర్‌ దగ్గర కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు పెళ్లి కారు కనిపించింది. ఇది పెళ్లిళ్ల సీజన్‌ కాకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పెళ్లి పేరుతో అందంగా అలంకరించిన కారులో స్మగ్లింగ్‌ చేస్తున్న ఎర్ర చందనం దుంగలను, నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు పోలీసులు. వారిని చిత్తూరు జిల్లా నిండ్ర మండలానికి చెందిన దొరవేలు, మంగళంకు చెందిన దిలీప్‌కుమార్‌, తేజ, నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలానికి చెందిన మస్తాన్‌లుగా గుర్తించారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates