పేటీఎం తో అదనపు చార్జీలు లేకుండా రైలు టికెట్‌ బుక్

క్యాష్ బ్యాక్,డిస్కౌంట్స్ రావడంతో ఆన్ లైన్లో బిజినెస్ పెరిగింది. దీంతో రకరకాల యాప్స్ యూజ్ చేయడం చేస్తున్నారు కస్టమర్స్. కొన్ని యాప్స్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే పేటీఎం యూజర్లకు ఓ ఆఫర్ ను ప్రకటించింది. ఈ మొబైల్ వాలెట్ నుంచి ఇక ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా రైలు టికెట్‌ను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. పేమెంట్ గేట్‌వే, సర్వీస్ చార్జీలను కూడా పేటీఎం రద్దు చేసింది. యూజర్లు తమ PNR స్టేటస్‌ను చూసుకోవడంతోపాటు టికెట్‌ను రద్దు చేసుకుంటే వెంటనే రీఫండ్ కోరే అవకాశం కల్పించింది. IRCTCతో ఈ మధ్యే మరో మొబైల్ వాలెట్ ఫోన్‌పె అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇందులో భాంగంగానే పేటీఎం తమ యూజర్లకు ఈ ఆఫర్ ఇస్తున్నది. ఇప్పటివరకు పేటీఎం మొత్తం రైలు టికెట్ చార్జీలో పేమెంట్ గేట్‌వే ఫీజు కింద 1.8 శాతం వసూలు చేస్తోంది. దీనికితోడు అదనపు చార్జీలు కూడా ఉండేవి. వీటన్నింటినీ రద్దు చేసినట్లు పేటీఎం వైస్‌ప్రెసిడెంట్ అభిషేక్ రాజన్ చెప్పారు. తరచూ ప్రయాణాలు చేసేవాళ్లు అంతకుముందు బుకింగ్స్‌ను రిపీట్ చేసుకునే అవకాశంతో ప్రతిసారీ ఒకే సమాచారాన్ని ఇవ్వాల్సిన పని కూడా ఉండదు. గతేడాది ప్రయాణి టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ల సంఖ్య భారీగా పెరిగినట్లు పేటీఎం ప్రకటించింది. 2017లో పేటీఎం ద్వారా మొత్తం 3.8 కోట్ల మంది టికెట్లు బుక్ చేసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates