పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2011 సాంఘిక ఆర్థిక సర్వే ప్రకారం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదలందరికీ ఉజ్వల పథకం కింద ఫ్రీగా LPG  కనెక్షన్లు అందించాలని కేంద్రం నిర్ణయించింది. పేదలందరికీ LPG కనెక్షన్లను ఉచితంగా అందించే పథకాన్ని కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర ఇంధనవనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. దేశంలో 27 కోట్ల ఇళ్లు ఉండగా 2014 మే వరకు వీరిలో కేవలం 13 కోట్ల మందికే ఎల్పీజీ కనెన్షన్లున్నాయి. నాలుగున్నరేళ్లలో 90 శాతం మందికి గ్యాస్ కనెక్షన్లు అందించేలా రూ.1,600 సబ్సిడీతో ఉజ్వల పథకం కింద పేదలకు గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates