పేదలకోసమే తపించిన కాకా: వివేక్ వెంకటస్వామి

కాకా వెంకటస్వామి బతికి ఉన్నంత కాలం పేద ప్రజల కోసం తపించారన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత తన తండ్రిదేనన్నారు. కాకా 4వ వర్ధంతి సందర్భంగా.. సాగర్ పార్క్ లోని ఆయన విగ్రహానికి పలువురు నేతలు నివాళులు అర్పించారు. ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, మాజీమంత్రి వినోద్, విశాక ఇండస్ట్రీస్ ఎండి సరోజ, విశాక జేఎండీ వంశీ .. కాకా విగ్రహానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు.

మరోవైపు కాకా 4వ వర్ధంతి సందర్భంగా బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీ. ఆర్. అంబేద్కర్ విద్యసంస్థలు సంస్మరణ సభను నిర్వహించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తో పాటు… ప్రొఫెసర్ ఎం.ఎల్. సాయికుమార్ కాకా విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకా సేవలను స్మరించుకున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates