పేదల ఆత్మగౌరవం కోసమే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు: కేటీఆర్

ktrపేదలు  ఆత్మగౌరవంతో  బతకాలనే  డబుడ్ బెడ్ రూమ్  ఇళ్లు  నిర్మిస్తున్నామన్నారు  మంత్రి కేటీఆర్.  సికింద్రాబాద్  సిఖ్ విలేజ్- గాంధీనగర్ లో 260 డబుల్ బెడ్  రూమ్ ఇళ్లకు మంత్రులు  మహమూబ్ అలీ,  తలసాని  శ్రీనివాస్ యాదవ్ లతో  కలసి  కేటీఆర్  శంకుస్థాపన చేశారు.  హైదరాబాద్ ను  స్లమ్-ఫ్రీ  నగరంగా  మారుస్తామన్నారు  కేటీఆర్. మారేడ్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో రూ. 41 కోట్లతో 536 ఇండ్ల నిర్మాణం అదేవిధంగా సిఖ్‌విలేజ్ మడ్‌పోర్ట్ గాంధీనగర్‌లో రూ. 15 కోట్లతో 176 ఇండ్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టిందన్నారు.

స్లమ్‌లలో నివసించే ప్రజలు ముందుకు వస్తే నగరంలో ఎన్నిఇళ్లయినా కట్టిస్తామన్నారు. పేద ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. సంఖ్యతో నిమిత్తం లేకుండా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఆ పథకం.. ఈ పథకం పేరుతో కేవలం రూ. 70 వేలు ఇచ్చారని అదే టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్కో ఇంటిపై రూ. 8 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రామన్నకుంట అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కంటోన్మెంట్ ఆస్పత్రిని తమకు అప్పగిస్తే అభివృద్ధి చేస్తమన్నారు. పూణె తరహాలో ఇక్కడ ఆర్మ్‌డ్‌ఫోర్స్ మెడికల్ కాలేజీ వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates