పేదల దగ్గరకే ఆహారం : అన్ని మున్సిపాలిటీల్లో రూ.5 భోజనం

5rupeesmeals

హైదరాబాద్ మహా నగరంలో విజయవంతంగా అమలు అవుతున్న రూ.5 భోజనం రాష్ట్రం మొత్తం విస్తరించాలని నిర్ణయించింది ప్రభుత్వం. అన్ని మున్సిపాలిటీల్లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావటానికి సన్నాహాలు చేస్తోంది సర్కార్. 72 మున్సిపాలిటీలతోపాటు కార్పొరేషన్లలోనూ ప్రారంభించాలని ఆదేశించింది మున్సిపాల్ శాఖ. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. వారం, పది రోజుల్లో రూ.5 భోజనం సెంటర్లను ప్రారంభించే విధంగా ఆయా మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు డైరెక్టర్.

ప్రతి మున్సిపాలిటీలో పేదలు నివాసం ఉండే ప్రాంతాల్లో రూ.5 భోజనం కౌంటర్లు ప్రారంభించనున్నారు. ఆయా మున్సిపాలిటీ పరిధిలో జనాభా ప్రాతిపదికతోపాటు డిమాండ్ ఆధారంగా ఎన్ని కౌంటర్లు పెట్టాలి అనేది ఈ నిర్ణయం కాలేదు. కార్పొరేషన్ పరిధిలో 5 నుంచి 6 సెంటర్లలో, మున్సిపాలిటీల్లో 2 నుంచి 3 సెంటర్లలో రూ.5 భోజనం కౌంటర్లు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అవసరాన్ని బట్టి పెంచుకునే వెసలుబాటు కూడా ఉంది. నిర్వహణ బాధ్యత స్థానిక అధికారులే చేపట్టాల్సి ఉంటుంది.

 

Posted in Uncategorized

Latest Updates