పేదింటి అమ్మాయి పెళ్లికి…పోలీసులే అమ్మా, నాన్న

ఓ పేదింటి అమ్మాయి పెళ్లికి పోలీసులే అమ్మా, నాన్నలయ్యారు. పెద్ద మనసుతో అన్నీ తామై ఔదార్యం చాటారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కు మారుపేరుగా నిలిచారు జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీసులు. ధర్మపురి మండలం రాయపట్నంకు చెందిన విజయ తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో తమ కూతురు వివాహం చేసే స్థితిలో లేరు. ఈ మధ్యే గ్రామానికి వెళ్లిన పోలీసులకు స్థానికులు అమ్మాయి పరిస్థితిని వివరించారు. ఈ విషయాన్ని పోలీసులు సీఐ లక్ష్మీబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి లక్ష రూపాయల పెళ్ళి ఖర్చులు భరించి… మంచిర్యాల జిల్లాకు చెందిన లక్ష్మణ్ తో విజయకు పెళ్లి జరిపించారు. తమ లాంటి పేదల ఆదుకున్నందుకు ఎప్పుడు రుణపడి ఉంటామన్నది అమ్మాయి తల్లి.

Posted in Uncategorized

Latest Updates