పేద క్రీడాకారులకు శ్రీమంతుడి చేయూత

చగ్రామాలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేయడంతో పాటు పేద క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు సినీ నటుడు మహేష్ బాబు. NRI సేవ ఫౌండేషన్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ ని కలిసి ఏప్రిల్ 2012 నుండి తాము నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాల గురించి, సేవ కార్యక్రమాల గురించి వివరించారు.

నమ్రత ద్వారా తెలుసుకున్న మహేష్ బాబు  సంస్థకు తన సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించుకున్నారు.అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. దీనితో పాటు పేదరికం తో సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న క్రీడాకారుల కోసం NRI సేవ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ‘స్పోర్ట్స్ పెర్ఫార్మన్స్ అండ్ ఎన్ హాన్సమెంట్ సెంటర్’ కు మహేష్ చేయూతనందించారు. ఇందులో భాగంగా జాతీయ క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించే దిశగా అవసరమైన స్పోర్ట్స్ రీహాబిలిటేషన్, గాయాల బారి నుండి ఎలా కాపాడుకోవాలో అవసరమైన తర్ఫీదు, ఫిట్ నెస్ ట్రైనింగ్ ని గచ్చిబౌలి స్టేడియంలో అందించనున్నారు. మొదటి దశగా స్పోర్ట్స్ రీహాబిలిటేషన్ సెంటర్ ను గచ్చిబౌలి స్టేడియం లో ప్రారంభించారు.

Posted in Uncategorized

Latest Updates