పేపర్ మిల్లులో పాత కార్మికులందరినీ కొనసాగించాలి: కేటీఆర్


సిర్పూర్‌ పేపర్‌ మిల్లు తిరిగి ప్రారంభమైతే ఎంతో మందికి ఉపాధి కలుగుతుందన్నారు మంత్రి కేటీఆర్. ప్రైవేట్ రంగంలో ఎక్కువగా పెట్టుబడులు తీసుకురావడానికి ముఖ్య కారణం ఉపాధి కల్పించడం కోమేనన్నారు. ఓ వైపు మూత పడిన పరిశ్రమలను తిరిగి ప్రారంభించి యుతకు ఉద్యోగాలు కల్పిస్తుంటే…మరోవైపు కొందరు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ మిల్లు రీ ఓపెనింగ్ కోసం ఎమ్మెల్యే కొనప్ప తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు.

కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ లో గురువారం(ఆగస్టు-2) పర్యటించిన మంత్రి కేటీఆర్.. సిర్పూర్ పేపర్ మిల్లు పున: ప్రారంభోత్సవ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.  జేకే గ్రూప్ చాలా పేరున్న సంస్థ అని… పేపర్ మిల్లును మరింత ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం ఉందన్నారు మంత్రి కేటీఆర్. పాత కార్మికులకులందరినీ పేపర్ మిల్లులో కొనసాగించాలని యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేసామన్నారు.

ప్రపంచంలో ఎక్కడా ఏ ప్రభుత్వం అందరికీ సర్కారు ఉద్యోగాలు కల్పించలేదన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకే ప్రైవేట్ పరిశ్రమలు ప్రోత్సహించడంతోపాటు ..అందులో ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందజలో ఉందన్నారు.

పరిశ్రమలు పెట్టడం…వాటికి రాయితీలు ఇవ్వడం ప్రభుత్వ పని…కానీ వాటిని నిలుపుకోవడం కార్మికులు, కార్మిక సంఘాల నేతలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఉపాధి కల్పన జరగాలని కొత్త, పాత పరిశ్రమలకు పెద్దఎత్తున రాయితీలు ఇస్తున్నామన్నారు. మూతపడ్డ పరిశ్రమలు తెరుచుకోవాలి…తెరుచుకున్న ఇండస్ట్రీలు విస్తరించబడాలి. దీనికి కార్మిక సంఘాల నేతలు సహకరించాలన్నారు. ఎవరో కొంత మంది చేసే తప్పుడు ప్రచారాలను కార్మికులు ఎవరూ నమ్మవద్దని… యాజమాన్యానికి సహాయ సహకారాలు అందించాలి సూచించారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులతో పాటు పరిశ్రమలకు 24 గంటలు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం తరుపున పూర్తి మద్దతు ఉంటుందని… జేకే యాజమాన్యం అతితక్కువ సమయంలో మిల్లును ప్రారంభించి కార్మికుల జీవితంలో వెలుగులు నింపాలన్నారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates