పేలిన సెల్ ఫోన్ : చిన్నారి వేలు తెగింది.. కన్ను పోయింది

phone-blastసెల్ ఫోన్.. చిన్నారి చేతిలో ఇది కామన్ అయ్యింది. స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చిన వెంటనే.. చేతిలో మొబైల్ పట్టుకుని గేమ్స్ ఆడుకోవటం కామన్. మన ఇళ్లల్లో రెగ్యులర్ గానే కనిపిస్తున్న దృశ్యం. ఇలా వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో పేలింది ఆ ఫోన్.  చూపుడు వేలు తెగిపోయింది. ఓ కన్ను పోయింది. వేలు అతికించటానికి కూడా వీలులేకుండా అయిపోయింది. కుడి కన్ను చూపు కోల్పోయాడు ఆ చిన్నారి. చైనాలో జరిగిన ఈ ఘోరంతో.. ఇప్పుడు ప్రపంచం షాక్ అయ్యింది. పేరంట్స్ అందరూ అలర్ట్ అయ్యారు.

మెంగ్ జిసు అనే 12 సంవత్సరాల చిన్నారి.. ఇంట్లోని ఫోన్ ను ఛార్జింగ్ పెట్టాడు. ఫోన్ లో వీడియో గేమ్ ఆడుతున్నాడు. ఒక్కసారి ఫోన్ పేలింది. సృహ కోల్పోయాడు. ఆ సమయంలో ఇంట్లో పేరంట్స్ లేరు. అక్క ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించింది. చూపుడు వేలు తెగిపోయిందని.. కన్ను చూపు కోల్పోయాడని చెప్పారు డాక్టర్లు. ఐదు గంటల సర్జరీ తర్వాత కన్నును పూర్తిగా తొలగించారు.

చైనా మొబైల్ కంపెనీ హువాట్యాంగ్ (HUA TUNGA)కి చెందిన VTV59 మోడల్ అది. ఫోన్ ఛార్జింగ్ పెట్టి.. వీడియో గేమ్ ఆడటం వల్లే ఇలా జరిగిందని వైద్యులు కూడా చెప్పారు. గత వారం చైనాలోని హుయాగ్జీ ప్రావిన్స్ ఈ ఘటన జరిగింది.

Posted in Uncategorized

Latest Updates