పేలిన సెల్ ఫోన్ : తెగిపడ్డ బాలుడి చేతివేళ్లు

ఇటీవల ఛార్జింగ్ పెడుతుండగా మొబైల్స్ పేలిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఫోన్ పేలడంతో ఓ బాలుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. మొబైల్ లో ఓ బాలుడు గేమ్ ఆడుతుండగా ఒక్కసారిగా బ్యాటరీ పేలిపోయింది. దీంతో ఆ బాలుడు చేతి వేళ్లు తెగిపడ్డాయి. ఈ ఘటన ఆదివారం (జూలై-29) కర్నూల్ జిల్లాలో జరిగింది. తుగ్గలి మండలం పెండేకల్ గ్రామానికి చెందిన జనార్దనాచారి (10) ఆదివారం ఉదయం సెల్‌ ఫోన్‌ లో గేమ్స్ ఆడుతుండగా ఫోన్‌ బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. దీంతో అతడి కుడి చేతి మూడు వేళ్లు తెగిపడ్డాయి. దీంతో బాలుడి తల్లిదండ్రులు పత్తికొండ ఆస్పత్రికి హుటాహుటిన తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే మొబైల్ ఏ కంపెనీకి చెందినది అనే విషయం తెలియరాలేదు.

Posted in Uncategorized

Latest Updates