పొటాషియం లోపిస్తే…ఎన్నో సమస్యలు

మన శరీరంలో నిత్యం అవసరమయ్యే పోషకాల్లో పొటాషియం ఒకటి. శరీరంలోని అనేక విధులు సక్రమంగా నిర్వర్తించేందుకు పొటాషియం ఎంతగానో తోడ్పడుతుంది. పొటాషియం శరీరంలో ద్రవాలను సమంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఎముకలకు బలాన్నిస్తుంది పొటాషియం.

పొటాషియం తగినంత లేకపోతే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. తీవ్రమైన అలసట వస్తుంది. చిన్నపని చేసినా చాలు త్వరగా అలసిపోతారు. కాళ్లలో కండరాలు పట్టేస్తాయి. పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంది. వికారంగా ఉండి వాంతులు అవుతాయి. కడుపు నొప్పి, గ్యా స్‍, మలబద్దకం లాంటి సమస్యలు వస్తాయి.

అరటిపండ్లు, పాలు, చికెన్‍, చేపలు, తృణధాన్యా లు, ఆకుపచ్చని కూరగాయలు, యాపిల్‍ పండ్లు, బాదం పప్పులలో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. ఈ ఆహారాన్ని తరచుగా తీసుకుంటే పొటాషియం లోపం నుంచి తప్పించుకోవచ్చు.

Posted in Uncategorized

Latest Updates