పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు : WWEను మరిపించిన ఫైట్ సీన్

fightingమధ్యప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర చిన్నపాటి ఫైటింగ్ జరిగింది. గుడి ముందు కొబ్బరికాయలు, పూలు అమ్ముకునే వారి మధ్య చిన్నగా మొదలైన గొడవ.. చివరకు రెజ్లింగ్ ఫైట్ స్థాయికి వెళ్లింది. మొదట ఇద్దరు మహిళల మధ్య వివాదం మొదలైంది. ఇద్దరు జుట్లు పట్టుకుని రోడ్డుపై పొర్లుకుంటూ మరీ కొట్టుకున్నారు. కాసేపటికే వారి భర్తలు ఫైట్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రాళ్లు, చెప్పులు, పైపులతో కొట్టుకున్నారు. ఇందులో ఓ వ్యక్తి మాత్రం ఎదుటివారిపై దూకుతూ.. కొడుతూ.. రెజ్లింగ్ ను మరిపించాడు.
దాదాపు అరగంటలపాటు ఈ ఫైటింగ్ సీన్ నడిచింది. అయితే.. పక్కనే పదుల సంఖ్యలో ప్రజలు అటూ ఇటు వెళ్తున్నా.. ఎవరు కూడా వీరిని ఆపే ప్రయత్నం చేయలేదు. వారెవ్వా.. జోర్దార్ ఫైటింగ్ అంటూ ఎంజాయ్ చేశారు. అంతేకాదు.. గొడవ జరిగిన ప్రాంతానికి యాభై మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నా.. ఎవరూ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు.

Posted in Uncategorized

Latest Updates