పొడగించిన రేషన్ గడువు

ప్రతి నెలా పంపిణీ చేసే రేషన్ సరుకులకు గడువును పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ప్రతి నెల 15వ తేదీ వరకు రేషన్ సరుకుల పంపిణీ చేస్తున్నారు. గత నెలలో డీలర్లు సమ్మెకు దిగడంతో సకాలంలో డీడీలు చెల్లించకపోవడంతో రేషన్ షాపులకు సరుకుల సరఫరా నిలిచిపోయింది. ఈనెల మొదటి వారంలో ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో డీలర్లు సమ్మె విరమించారు. దీంతో సరుకులు పంపిణీ చేయడానికి అదనంగా గడువు కావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా ఈనెల 20వ తేదీ వరకు రేషన్ సరుకులని రేషన్‌దారులకు ఇబ్బందులు కలుగకుండా పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

జూలై నెలకు సంబంధించిన నిత్యావసర సరుకుల పంపిణీని ఈనెల 20వరకు పొడిగిస్తూ పౌరసరఫరాల కమిషనర్ ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలోని రేషన్ డీలర్లు రేషన్‌దారులకు 20వ తేదీ వరకు సరుకులు పంపిణీ చేయనున్నారు.

Posted in Uncategorized

Latest Updates