పొత్తుపై త్వరలో! : సోనియాగాంధీని కలిసిన కమల్ హాసన్

KAMALఢిల్లీలో కాంగ్రెస్ అధినాయకత్వంతో రెండు రోజులుగా మంతనాలు జరుపుతున్నారు మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్. UPA చైర్ పర్సన్ సోనియాగాంధీతో ఈ రోజు సమావేశమయ్యారు కమల్ హాసన్. సోనియాను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కమల్.. మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలిపారు. తన పార్టీ ఎన్నికల గుర్తు కోసం ఢిల్లీ వచ్చిన కమల్… బుధవారం ఈసీని కలిసి అవసరమైన పత్రాలు సమర్పించిన తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ని కలిసి ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. అయితే కాంగ్రెస్ నేతలను కమల్ కలుస్తుడటంపై….. కమల్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. మరోవైపు పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని కమల్ తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates