పోచమ్మ తల్లి దీవెనలతో.. పంటలు బాగా పండాలి : వివేక్ వెంకటస్వామి

తెలంగాణ అభివృద్ది కోరుతూ పోచమ్మ తల్లిని అందరూ మొక్కుకోవాలని ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిన కారణంగానే మన పండుగలను ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పలు పోచమ్మ బోనాల కార్యక్రమాల్లో సతీమణి సరోజతో కలిసి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. బోనం ఎత్తుకుని… పోచమ్మ గుడిలో అమ్మవారికి నైవైద్యం సమర్పించారు వివేక్ సరోజ దంపతులు. డప్పు దరువులతో గ్రామస్తులు వివేక్ దంపతులకు స్వాగతం పలికారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగపుత్రులు పెద్దమ్మ తల్లికి నిర్వహించిన బోనాల కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates