పోటెత్తుతున్న భక్తులు : షిర్డీ ద్వారకామాయిలో సాయి దర్శనం

షిర్డీ సాయిబాబా మందిరం భక్తులతో కిటకిటలాడుతోంది.  షిర్డీలోని ద్వారకా మాయిలోని ఓ గోడపై బుధవారం అర్ధరాత్రి సాయిబాబా ఆకృతి (చిత్రం) కన్పించిందని ఓ భక్తుడు తెలపడంతో షిర్డీ పరిసరాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. మూడు గంటలపాటు సాయిబాబా చిత్రం కన్పించిందని స్థానికులు చెబుతున్నారు.
సాయిబాబా దర్శనమిచ్చిన ద్వారకామాయిలోని గోడను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున షిర్డీకి చేరుకుంటున్నారు.

భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో, దర్శనం సమయాన్ని పెంచారు ఆలయ అధికారులు. మామూలు రోజుల్లో రాత్రి 12 గంటల వరకే అనుమతించగా..రెండురోజులుగా మరో రెండు గంటలు పోడిగించారు.  దీంతో షిర్డీకి వెళ్లే బస్సులు, రైళ్లలో విఫరీతమైన రద్దీ ఏర్పడింది. ఫ్లైట్స్ బుకింగ్స్ కూడా ఫుల్ అయ్యాయి. అయితే ఇలాంటిదేమి ఉండదని కొందరు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. భక్తులు నిజమేనంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.  ఇదిలా ఉండగా షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ మాత్రం ఈ విషయంపై అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Posted in Uncategorized

Latest Updates