పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మ

పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మ అంటూ సాగే చివరి రోజు సద్దుల బతుకమ్మ సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఎంగిలిపూలతో మొదలైన పూల పండుగ ..బుధవారం (అక్టోబర్-17)న  సద్దుల బతుకమ్మతో సందడిగా ముగిసింది. తీరొక్క పూలతో సద్దుల బతుకమ్మను పేర్చిన తెలంగాణ ఆడపడుచులు.. పూల జాతరను ఘనంగా జరుపుకున్నారు. పట్టణాలు, నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి చోటా సద్దుల బతుకమ్మ వేడుకల్లో మహిళలు, యువతులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. వారికి దగ్గర్లో ఉండే ప్రధాన ప్రాంతాలు, చెరువులు, వాగుల వద్ద బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. పోయిరా బతుకమ్మ..పోయిరావమ్మా అంటూ పాటలు పాడుతూ బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

Posted in Uncategorized

Latest Updates