పోరుకు సిద్ధమైన భారత్ : ఇంగ్లాండ్ కు ఇది వెయ్యో టెస్ట్ మ్యాచ్   

మరో రసవత్తర పోరుకు భారత్ సిద్ధమైంది. బుధవారం (ఆగస్టు-1) నుంచి ఇంగ్లాండ్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ సమరానికి అన్ని అస్త్రాలతో రెడీ అయింది భారత్. టీ20సిరీస్ విజయంతో ఇంగ్లండ్ పర్యటనను మొదలుపెట్టిన కోహ్లీసేనకు.. వన్డేలో ఊహించని పలితం దక్కింది.  ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత్ ఆట తీరు కాస్త ఆందోళన కలిగిస్తోంది. పరుగుల వేటలో టాపార్డర్ ఫెయిల్ అవడం.. బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం లాంటి లోపాలు బయటపడ్డాయి.

వీటిని సరిదిద్దుకుంటేనే టీమిండియాకు అనుకున్న పలితాలు దక్కనున్నాయి. అయితే ఎలాగైనా టెస్ట్ సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది భారత్.  బుధవారం నుంచి ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరగనున్న తొలి టెస్టు ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనుంది. ఇంగ్లీష్ జట్టుకు ఇది వెయ్యో టెస్ట్ మ్యాచ్. 1877 మార్చిలో ఆ స్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడిన ఇంగ్లండ్ ఇప్పటివరకు 999టెస్టు మ్యాచ్ లు పూర్తి చేసింది. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది ఇంగ్లాండ్. వన్డే సిరీస్ ను కోల్పోయిన భారత్ ..టెస్ట్ సిరీస్ ను ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. దీంతో ఇరుజట్ల మధ్య పోరు రసవత్తరంగా జరగనుంది.

Posted in Uncategorized

Latest Updates