పోర్టు ఎలిజబెత్ వన్డే : గెలిస్తే భారత్ కు రికార్డుల పంట

virat-kohli-dhoni-bcci_806x605_41518371119సౌతాఫ్రికాతో జరుగుతున్న ఆరు వన్డేల సిరీస్ భాగంగా మంగళవారం (ఫిబ్రవరి-13) పోర్టు ఎలిజబెత్ లో జరగనున్న ఐదో వన్డేకు సిద్ధమైంది టీమిండియా. ఇప్పటివరకు 3 మ్యాచ్ లో గెలిచిన భారత్ కు ఈ వన్డే కీలకం. సిరీస్ తో పాటు చరిత్ర సృష్టించే ఛాన్స్ కోహ్లీ సేన ముందుందు. జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన నాలుగో వన్డే‌లో పింక్ జెర్సీతో బరిలోకి దిగిన సఫారీలు తమ రికార్డును పదిలపరుచుకున్నారు.

ఇప్పటి వరకు జరిగిన ఆరు పింక్ వన్డేల్లోనూ విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో కనుక భారత్ గెలిస్తే టీమిండియా ఖాతాలో సరికొత్త రికార్డు చేరుతుంది. పోర్టు ఎలిజబెత్ స్టేడియంలో భారత్ ఇప్పటి వరకు నాలుగు వన్డేలు ఆడగా.. ఏ ఒక్కదాంట్లోనూ విజయం సాధించలేదు. మంగళవారం వన్డే కనుక గెలిస్తే భారత్ రికార్డు సృష్టించినట్టే.

కోహ్లీకి మరో రికార్డ్

ఈ స్టేడియంలో అద్భుతమైన రికార్డు కలిగిన సఫారీలు.. రేపటి మ్యాచ్‌లోనూ గెలిచి, టీమిండియా సిరీస్ ఆశలను దూరం చేయాలని చూస్తోంది. ఈ వన్డేలో గెలిచి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు కోహ్లీ. దీంతో ఐదో వన్డే రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. గతంలో ఈ స్డేడియంలో జరిగిన నాలుగు వన్డేలకు అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, ధోనీలు కెప్టెన్లుగా వ్యవహరించారు. వారెవరికీ దక్కని విజయాన్ని కోహ్లీ తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ మ్యాచ్ గెలిస్తే కోహ్లీ ఖాతాలోనూ మరో అరుదైన గౌరవం దక్కనుందన్నమాట. పోర్టు ఎలిజబెత్ వన్డే గెలిస్తే భారత్ చరిత్ర సృష్టించడంతో పాటు..కెప్టెన్ కోహ్లీ రికార్డులతో మొత్తం భారత్ కు రాకార్డుల పంట పండినట్లే. మరి చూడాలి ఈ వన్డేలో టీమిండియా ఎలా రాణిస్తుందో.

Posted in Uncategorized

Latest Updates