పోలింగ్ బూత్ దగ్గర ఘర్షణ : ఒకరి మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

NAGAనాగాలాండ్ లో ఓటింగ్ జరుగుతున్న పోలింగ్ బూత్ దగ్గర జరిగిన గొడవలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నాగా పీపుల్ ఫ్రంట్, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసీవ్ పార్టీ ల మధ్య జుహెన్ బోటో జిల్లాలోని అకులతో పోలింగ్ బూత్ దగ్గర వివాదం జరిగింది. దొంగ వోట్లు వేస్తున్నారంటూ ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటంతో ఓ పార్టీ కార్యకర్త చనిపోగా మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ గొడవల వల్ల పోలింగ్ డిస్ట్రర్బ్ కాలేదని, పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates