పోలింగ్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదు : రజత్ కుమార్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు ఈసీ రజత్ కుమార్. ఎన్నికల కోడ్ ఇవ్వాలటికీ అయిపోయిందన్నారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం. మేము ముందు నుంచి ఈవీఎంలపై క్లారిటీగా వివరించాము. ఓటింగ్ లో ఈవీఎంల పాత్ర చాలా గొప్పదని..ఎలాంటి పొరపాట్లు జరగలేదని తెలిపారు. ఒకవేళ ఎవరికైనా అనుమానాలుంటే ..చట్టం ప్రకారం కోర్టుకు వెళ్లవచ్చని తెలిపారు. గ్రామ పంచాయతి ఎలక్షన్ సందర్భంగా కొత్తగా ఓటును నమోదు చేసుకునే వారికోసం  డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేశామన్నారు.

Posted in Uncategorized

Latest Updates