పోలింగ్ స్పెషల్: ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

హైదరాబాద్: రాష్ట్రంలో ఇవాళ(శుక్రవారం) జరగనున్న పోలింగ్ కు సంబంధించి  ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సిటీ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్లడానికి వీలుగా అదనపు బస్సులు నడపనుంది. రోజూ నడిచే బస్సులకు అదనంగా 1200 ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.

ఎంజీబీఎస్‌ నుంచి మహబూబ్‌నగర్‌, అచ్చంపేట, కల్వకుర్తి, నారాయణపేట, నాగర్‌ కర్నూల్‌, ఖమ్మం, మక్తల్‌, ప్రాంతాలకు.. జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాలకు, ఉప్పల్‌ నుంచి వరంగల్‌, తొర్రూరు, జనగామ, యాదగిరిగుట్ట,  ప్రాంతాలకు అదనపు బస్సులు నడవనున్నాయి.

Posted in Uncategorized

Latest Updates