పోలింగ్ స్పెషల్: ఇవాళ టోల్ ప్లాజాల్లో ఫ్రీ ఎంట్రీ

హైదరాబాద్: ఓటు వేసేందుకు సిటీ నుంచి తమ సొంత ఊళ్లకు నగరవాసులు పయనమయ్యారు. దీంతో టోల్ గేట్ల దగ్గర వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఓటు వేసేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు టోల్ ప్లాజాల దగ్గర ఉన్న రద్దీతో ఇబ్బందులు పడటాన్ని కొంతమంది ఈసీ దృష్టికి తీసుకొని వెళ్లారు.

వెంటనే స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తక్షణమే టోల్ ప్లాజాలను ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసింది. నగరం నుంచి లక్షలాది మంది ఓటు వేసేందుకు ఇప్పటికే తమ స్వస్థలాలకు బయల్దేరడంతో టోల్ ఫ్లాజాల దగ్గర ఒక్కసారిగా రద్దీ ఎక్కవైంది.

Posted in Uncategorized

Latest Updates